N. Chandrababu Naidu మహానాడు వేదికగా వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “వేట కొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానం.. ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానం.. బోత్ ఆర్ నాట్ సేమ్” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
TDP Mahanaadu 2026లో ప్రసంగించిన చంద్రబాబు.. “నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్” అంటూ వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులు “క్రూయల్ మెంటాలిటీ”కి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
“ఐటీ నుంచి క్వాంటం వరకు మన ప్రయాణం”
రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం.. టెక్నాలజీ ఆధారిత పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. లెగసీ వ్యర్థాలను తొలగించి డోర్ టూ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేపట్టామని తెలిపారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని.. ఆస్తుల భద్రత కోసం క్యూ ఆర్ కోడ్ ఆధారిత బ్లాక్‌చైన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. యువతకు కావాల్సింది “గొడ్డలి వేటు కాదు.. ఉద్యోగాలు” అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
ఇరాన్‌లో యుద్ధ పరిస్థితుల ప్రభావం ఏపీపై కూడా పడిందని చంద్రబాబు అన్నారు. గ్యాస్ సరఫరా సమస్యలు తలెత్తాయని.. ఆక్వా, అరటి ధరలు కూడా తగ్గిపోయాయని తెలిపారు. సంక్షేమాన్ని అవకాశంగా మార్చి ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
“కేడర్‌నే పార్టీ బలం”
టీడీపీ కేడర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. “కేడర్‌ను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త కూడా నాయకుడే” అని పేర్కొన్నారు.
అనుచరులను కాదు.. నాయకులను తయారు చేయాలన్నదే పార్టీ లక్ష్యమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.