వైసీపీ ఒక్క సీటుకే పరిమితమవుతుందని జోస్యం.. మహిళా సాధికారతపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసించిన మంత్రి

కాకినాడ జిల్లా కాజులూరులో జరిగిన మహానాడు కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రాష్ట్రానికి క్యాన్సర్‌లాంటి వ్యక్తి అని, కల్తీ మద్యం, గంజాయి, అక్రమ మైనింగ్‌లకు ప్రోత్సాహం ఇచ్చారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేస్తుంటే, జగన్ తన సొంత కుటుంబ సభ్యులను దూరం చేశారని విమర్శించారు. టీడీపీ, వైసీపీ మధ్య భారీ తేడా ఉందని పేర్కొన్న ఆయన, గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం జగన్ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటుకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీశ్ మాధుర్ మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.